టీమిండియా తొలుత ఇంగ్లండ్‌.. తర్వాత పసికూనతో! పూర్తి షెడ్యూల్‌, వివరాలు | WC Warm-Up Matches 2023 Full Schedule: Live Streaming, Venue, Timings | Sakshi
Sakshi News home page

WC Warm Up Matches: టీమిండియా తొలుత ఇంగ్లండ్‌.. తర్వాత పసికూనతో! పూర్తి షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలివే

Sep 28 2023 4:37 PM | Updated on Oct 3 2023 7:43 PM

WC Warm Up Matches 2023 Full Schedule: Live Streaming Venues Timings - Sakshi

టీమిండియా

ICC Men's Cricket World Cup warm-up matches 2023: భారత్‌లో క్రికెట్‌ ఫీవర్‌ తారస్థాయికి చేరింది. వారం రోజుల్లో ఐసీసీ ఈవెంట్‌ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆతిథ్యానికి టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు భారత్‌కు చేరుకుంటున్నాయి.

ప్రధాన మ్యాచ్‌ల కంటే ముందు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌, తిరువనంతపురం, గువాహటి ఈ సన్నాహక మ్యాచ్‌లకు వేదికలుగా మారనున్నాయి. 

మరి.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరుగనున్న వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌, టైమింగ్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, టికెట్ల బుకింగ్‌ తదితర వివరాలు తెలుసుకుందామా?!

సెప్టెంబరు 29, 2023 - శుక్రవారం
1. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి
2. దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్తాన్, గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
3. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్

సెప్టెంబరు 30, 2023- శనివారం
4. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి
5.ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

అక్టోబరు 2, 2023- సోమవారం
6.ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి
7.న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

అక్టోబరు 3, 2023- మంగళవారం
8.అఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి
9.ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్‌ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
10.పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్

మ్యాచ్‌ ఆరంభ సమయం
వార్మప్‌ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
ఐసీసీ మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023కు సంబంధించిన వార్మప్‌, ప్రధాన మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
డిజిటల్‌ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో మొబైల్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.

బుక్‌ మై షోలో.... 
వరల్డ్‌ కప్‌- 2023 ప్రధాన, వార్మప్‌ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్‌ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. టీమిండియా మినహా ఇతర జట్ల వార్మప్‌ మ్యాచ్‌లకు టికెట్లు ఆగష్టు 25 నుంచే అందుబాటులోకి రాగా..  భారత జట్టు ఆడే వార్మప్‌ మ్యాచ్‌లకు ఆగష్టు 30 నుంచి అందుబాటులో వచ్చాయి.

చదవండి: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి: బాబర్‌ భావోద్వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement