Was a Bit Shocked When I Wasn’t Picked for Asian Games: Dhawan - Sakshi
Sakshi News home page

#Shikhar Dhawan: 'నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా.. కానీ ఆ విషయంలో మాత్రం హ్యాపీ'

Aug 11 2023 9:01 PM | Updated on Aug 11 2023 9:24 PM

Was a bit shocked when I wasnt picked for Asian Games: Dhawan - Sakshi

టీమిండియా వెటరన్‌ వికెట్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌కు వెళ్లే భారత జట్టుకు ధావన్‌ సారధ్యం వహిస్తాడని అంతా భావించారు. కానీ గబ్బర్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత జట్టుకు యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను సారధిగా ఎంపిక చేశారు.

కాగా గతంలో చాలా సిరీస్‌ల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావనే నాయకత్వం వహించాడు. ఇక ఆసియాగేమ్స్‌కు చోటు దక్కకపోవడంపై ధావన్‌ తాజాగా స్పందించాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు వేరే ఆలోచనతో జట్టును ఎంపిక చేశారని నేను భావించాను. దాన్ని మనం అంగీకరించక తప్పదు.

రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు మొత్తం యువకులతో కూడి ఉంది. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.. జట్టుకు అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తూనే ఉంటాను. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి.

నేను ఇప్పటికీ ఫిట్‌నెస్‌గా ఉన్నాను. అయితే నా ఫ్యూచర్‌ కోసం ఏ సెలక్టరు కూడా ఇప్పటివరకు నాతో ఏమి మాట్లాడలేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు టైటిల్‌ను అందించడమే నా లక్ష్యమని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్‌ పేర్కొన్నాడు.
చదవండి'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement