కోహ్లి కథ ముగిసినట్టేనా..! | Virat Kohli Surpasses Sourav Ganguly To Set Unwanted Record | Sakshi
Sakshi News home page

కోహ్లి కథ ముగిసినట్టేనా..!

Mar 12 2021 11:04 PM | Updated on Mar 13 2021 3:14 PM

Virat Kohli Surpasses Sourav Ganguly To Set Unwanted Record - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మొదటి టీ 20లో ఐదు బంతులాడిన కోహ్లి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్‌ సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్‌ అయిన రికార్డును చెరిపేశాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 14 సార్లు డకౌట్‌ అయిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్‌ ధోని 11 సార్లు, కపిల్‌ దేవ్‌ 10 సార్లు, మహ్మద్‌ అజారుద్దీన్‌ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు.

 

చదవండి: (తొలి టీ20 ‌: ఇంగ్లండ్ ఘన విజయం‌‌‌‌‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement