
కేప్‌టౌన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 13 ఓవర్ ప్రారంభమైనప్పుడు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హెల్మెట్ ధరించి డ్రెస్సింగ్ రూమ్‌లో షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలెపెట్టాడు. ఈ క్రమంలో యాదృచ్ఛికంగా తరువాత బంతికే మయాంక్ అగర్వాల్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. కగిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, పుజరా జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజు లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే మరో సారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను బారత్ సాధించగలిగింది.
— Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022
చదవండి: IND vs SA 3rd Test: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1