Virat Kohli: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్‌ వైఫల్యం కొంపముంచింది'

Virat Kohli Says We-Deserve-To-Lose Dropped Few Chances-Loss Vs KKR - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 21 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్‌ లామ్రోర్‌ 34, దినేశ్‌ కార్తిక్‌ 22 పరుగులు చేశారు.

అంతకముందు కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్‌ రానా 48, వెంకటేశ్‌అయ్యర్‌ 27 పరుగులు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్‌(10 బంతుల్లో 18 నాటౌట్‌), డేవిడ్‌ వీస్‌(3 బంతుల్లో 12 నాటౌట్‌) సిక్సర్లు బాదడంతో కేకేఆర్‌ 200 మార్క్‌ అందుకుంది.

ఇక మ్యాచ్‌ ఓటమిపై కోహ్లి స్పందిస్తూ.. ''నిజాయితీగా చెప్పాలంటే చేజేతులా మ్యాచ్‌ను వారికి కోల్పోయాం. మ్యాచ్‌ ఓడిపోవాలని రాసిపెట్టి ఉంది. మా ఆటలో ఇవాళ చాలా లోపాలు కనిపించాయి. పేలవమైన ఫీల్డింగ్‌, క్యాచ్‌ల డ్రాప్‌లతో దాదాపు 25 నుంచి 30 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. అదే మా కొంప ముంచింది.

అయితే మాకు మంచి ఆరంభం లభించినప్పటికి దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఇక బ్యాటింగ్‌లో మంచి భాగస్వామ్యం కరువైంది. చేజింగ్‌లో అదే ముఖ్యం. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. సీజన్‌లో విజయాలు సాధిస్తున్న చోటే ఓటములు వస్తున్నాయి. కానీ ఒత్తిడిని దరిచేరనీయం. రాబోయే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఫినిషర్‌ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top