
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్‌ను మధురానుభూతిగా మలుచుకున్నాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది.
అలా టెస్టు సిరీస్ ముగియగానే వన్డే సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. గురువారం తొలి వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి చేసిన పని నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాధన చేసిన కోహ్లి ఒక బంతికి చక్కటి షాట్ ఆడి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు.
'మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?'' అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2023
చదవండి: కుల్దీప్ యాదవ్ సంచలన స్పెల్.. వెస్టిండీస్ 114 ఆలౌట్