విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి ఆటగాడిగా | Virat Kohli becomes the first player to have 400 runs in 10 different seasons | Sakshi
Sakshi News home page

#Virat Kohli: విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి ఆటగాడిగా

Apr 26 2024 12:00 AM | Updated on Apr 26 2024 12:00 AM

Virat Kohli becomes the first player to have 400 runs in 10 different seasons

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 10 సీజన్లలో 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా 400 రన్స్‌ను క్రాస్‌ చేసిన విరాట్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులు సాధించాడు.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కోహ్లి హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 43 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో ఓపెనర్‌గానూ కోహ్లి 4000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement