
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుత్ను నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే 61 పరుగులు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లి విసిరిన త్రో రూట్‌కు తగలడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన బంతిని రూట్ ఫ్లిక్ చేయగా.. పాయింట్ దిశలో ఉన్న కోహ్లి పంత్‌వైపు బంతిని విసిరాడు.
పంత్ బంతిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. దీంతో బంతి అనుకోకుండా రూట్ కాళ్ల మధ్యలో బలంగా తాకింది. ఆ దెబ్బకు నొప్పితో విలవిలలాడిన రూట్.. ''కమాన్ కోహ్లి ఎంత పని చేశావ్'' అంటూ అరిచాడు. అయితే కోహ్లి వెంటనే రూట్ దగ్గరకి పరిగెత్తుకొచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు. తాను సరైన దిశలో బంతిని త్రో చేయలేకపోయానని.. ఐయామ్ సారీ రూట్ అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి:
అప్పుడు పుజారా.. ఇప్పుడు సిబ్లీ.. అదే తరహాలో
Hitting the balls well, Kohli #INDvENG pic.twitter.com/2yXL7grNbf
— Spider-Verse (@Spiderverse17) March 6, 2021