ఒక్క ఇన్నింగ్స్‌తో న‌లుగురికి చెక్‌! | Vaibhav Sooryavanshi Achieves Huge IPL Feat Fastest Fifty Vs CSK | Sakshi
Sakshi News home page

Vaibhav Sooryavanshi: ఒక్క ఇన్నింగ్స్‌తో న‌లుగురికి చెక్‌!

Mar 31 2026 7:53 AM | Updated on Mar 31 2026 1:24 PM

Vaibhav Sooryavanshi Achieves Huge IPL Feat Fastest Fifty Vs CSK

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆట మొదలుపెట్టేశాడు. అండర్‌-19 టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున తన తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ అర్థసెంచరీ సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్‌తో న‌లుగురి రికార్డుల‌కు చెక్ పెట్టాడు ఈ బీహార్ చిన్నోడు. 

మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థ‌సెంచ‌రీ సాధించిన సూర్య‌వంశీ 17 బంతుల్లో 52 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ నేప‌థ్యంలో గ‌త ఐపీఎల్ సీజ‌న్ల‌లో 16 బంతుల్లో అర్థ‌సెంచ‌రీలు సాధించిన సురేశ్ రైనా, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, ట్రావిస్ హెడ్‌ల రికార్డులు క‌నుమ‌రుగ‌య్యాయి. చెన్నై విధించిన టార్గెట్ చిన్న‌ది కావడంతో చ‌ప్ప‌గా సాగుతున్నమ్యాచ్‌ను సూర్య‌వంశీ త‌న ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో జోష్ నింపాడు. 

అంతేకాదు ఐపీఎల్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున త‌క్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన జాబితాలో రెండు సూర్య‌వంశీ పేరిటే ఉండ‌డం విశేషం. 2025లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో అర్థ‌సెంచ‌రీ మార్క్ అందుకున్న వైభ‌వ్‌.. తాజాగా సీఎస్‌కేపై 15 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని త‌న రికార్డును తానే స‌వ‌రించుకున్నాడు. 

కాగా 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కం సాధించిన జైస్వాల్ రికార్డు ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌కుండా ఉంది. 2018లో జాస్ బ‌ట్ల‌ర్‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 18 బంతుల్లో అర్థశ‌త‌కం సాధించాడు.  అంతేకాదు లోస్కోరింగ్ మ్యాచ్ అయిన‌ప్ప‌టికీ మ‌రికొన్ని రికార్డులు కూడా మ్యాచ్‌లో న‌మోద‌య్యాయి. 

మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..

  • ఐపీఎల్‌లో సీఎస్‌కేపై అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్ల‌లో రాజ‌స్తాన్ రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌తో క‌లిసి సంయుక్తంగా ఉన్న రాజ‌స్తాన్ సీఎస్‌కేపై తాజా దానితో క‌లిపి 16 విజ‌యాలు న‌మోదు చేసింది. తొలి స్థానంలో ముంబై (21 విజ‌యాలు) ఉంది. 13 విజ‌యాల‌తో ఆర్సీబీ మూడో  స్థానంలో, 12 విజ‌యాల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నాలుగో స్థానంలో, 11 విజ‌యాల‌తో కేకేఆర్ ఐదో స్థానంలో ఉన్నాయి.

  • 2020 నుంచి చూసుకుంటే సీఎస్‌కేతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 9 విజయాలు సాధించి స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలవ‌డం విశేషం.

  • ఐపీఎల్‌లో 120 ప్ల‌స్ స్కోర్ల‌ను అత్యంత త‌క్కువ ఓవ‌ర్ల‌లో ఛేదించిన నాలుగో జ‌ట్టుగా రాజ‌స్తాన్ నిలిచింది. గ‌తంలో ఎస్ఆర్‌హెచ్ (9.4 ఓవ‌ర్ల‌లో), పంజాబ్ కింగ్స్ (11.1 ఓవ‌ర్లలో), డెక్క‌న్ చార్జ‌ర్స్ (12 ఓవ‌ర్ల‌లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

చదవండి: రాయల్స్‌ రాజసం

Advertisement
 
Advertisement
Advertisement