VHT 2022: ఆర్యన్‌ అద్భుత శతకం.. హైదరాబాద్‌పై ఉత్తరప్రదేశ్‌ ఘన విజయం

Uttar pradesh beat Hyderabad in Vijay Hazare trophy 2022 - Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా హైదరాబాద్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. మికిల్‌ జైస్వాల్‌ (59 బంతుల్లో 73; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ బుద్ధి (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలు చేయగా...శివమ్‌ మావి 3, సౌరభ్‌ కుమార్‌ 2 వికెట్లు తీశారు.

అనంతరం యూపీ 48.4 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు సాధించింది. ఆర్యన్‌ జుయాల్‌ (136 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం బాదగా...రింకూ సింగ్‌ (48 బంతుల్లో 78 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాధవ్‌ కౌశిక్‌ (92 బంతుల్లో 70; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రోహిత్‌ రాయుడుకే 3 వికెట్లు దక్కాయి.
చదవండి: IND Vs NZ 1st T20: ఆగని వర్షం.. భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top