అమెరికా మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఉన్ముక్త్‌ చంద్‌.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌

Unmukt Chand Inks Multi Year Deal With USA Major League Cricket - Sakshi

కాలిఫోర్నియా: భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత అండర్‌–19 జట్టు మాజీ కెప్టెన్, ఢిల్లీ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ అమెరికాలోని మేజర్‌ లీగ్‌  క్రికెట్‌ (ఎంఎల్‌సీ)తో రెండేళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఎంఎల్‌సీలో భాగంగా కాలిఫోర్నియాలో శనివారం మొదలైన టయోటా మైనర్‌ లీగ్‌ టి20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో 28 ఏళ్ల ఉన్ముక్త్‌ సిలికాన్‌ వ్యాలీ స్ట్రయికర్స్‌ జట్టు తరఫున తొలి మ్యాచ్‌ ఆడాడు. సాన్‌డియాగో సర్ఫ్‌ రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ మూడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉన్ముక్త్‌ చంద్‌ జట్టు(సిలికాన్‌ వ్యాలీ స్ట్రయికర్స్‌) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షెహాన్‌ జయసూర్య(74) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాన్‌డియాగో సర్ఫ్‌ రైడర్స్‌ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఈ లీగ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ సహా చాలామంది ఇండో అమెరికన్‌ ప్లేయర్లు పాల్గొంటున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top