ఏసీసీ ఉమెన్స్ టీ20 ప్రీమియర్ కప్ 2026లో యూఏఈ- సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ ఓ సంచలన రికార్డుకు వేదికైంది. ప్రత్యర్ధి నిర్ధేశించిన లక్ష్యాన్ని యూఏఈ మహిళల జట్టు కేవలం 5 బంతుల్లోనే ఛేదించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం భాంగ్ వేదికగా యూఏఈ, సౌదీ అరేబియా జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ జట్టు యూఏఈ బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో కేవలం 25 పరుగులకే కుప్పకూలింది. . ఆ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ప్టెన్ మషాయెల్ వకాస్ చేసిన 9 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
సురక్షా కొట్టే, హీనా హోట్‌చందాని, ఈషా ఓజా తలా 3 వికెట్లు పడగొట్టి సౌధీ పతనాన్ని శాసించారు. అనంతరం 26 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. ఐదు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. తొలి ఓవర్ వేసిన సౌదీ బౌలర్ మహ్ నూర్ అమీర్ 11 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా.. యూఏఈ బ్యాటర్ ఈషా ఓజా కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.
దీంతో మహిళల టీ20 చరిత్రలోనే అత్యంత వేగవంతమైన చేజింగ్(బంతులు పరంగా) చేసిన నాలుగో జట్టుగా యూఏఈ నిలిచింది. ఈ జాబితాలో రువండా అగ్రస్ధానంలో ఉంది. మాలీతో జరిగిన మ్యాచ్‌లో రువండా తొలి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
చదవండి: IND vs AFG: పంత్‌కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!


