breaking news
ACC Asia Cup Qualifiers tournament
-
వన్డే మ్యాచ్.. రికార్డు స్కోర్, భారీ విజయం
ACC Mens Challenger Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్-2023లో రికార్డు విజయం నమోదైంది. టోర్నీలో భాగంగా మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఏకంగా 327 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్ చరిత్రలో ఇది భారీ విజయంగా రికార్డైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ అరేబియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేయగా.. ఛేదనలో మయన్మార్ 25.3 ఓవర్లలో 97 పరగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Saudi Arabia dominates Myanmar with a massive 327-run victory in the #ACCChallengercup, qualifying for the semifinals in style! Congratulations to the team on their remarkable performance! pic.twitter.com/5SyTaDgotu — AsianCricketCouncil (@ACCMedia1) March 1, 2023 సౌదీ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మనన్ అలీ (102) సెంచరీతో చెలరేగగా.. మహ్మద్ హిషమ్ షేక్ (59), అబ్దుల్ వహీద్ (61), జైన్ ఉల్ అబ్దిన్ (66 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. మయన్మార్ బౌలర్లలో ఖిన్ అయే, ఔంగ్ ఖో ఖో తలో 2 వికెట్లు పడగొట్టగా.. పైంగ్ దాను, సాయ్ హ్టెట్ వై, కో కో లిన్థు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మయన్మార్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. వీరిలో యే నైంగ్ తున్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌదీ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 4 వికెట్లు పడగొట్టగా.. జైన్ ఉల్ అబ్దిన్ 2, అబ్దుల్ వహీద్, జుహైర్ మహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో సౌదీ అరేబియా దర్జాగా సెమీస్ఫైనల్లోకి ప్రవేశించింది. -
కాంబోడియాతో భారత్ పోరు నేడు
ఫానోమ్ పెన్: ఈనెల చివరివారం నుంచి జరిగే ఏసీసీ ఆసియా కప్ క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహకంగా కాంబోడియా జట్టుతో బుధవారం భారత్ స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. భారత్ కంటే 41 స్థానాలు వెనుకంజలో ఉన్న కాంబోడియాతో మ్యాచ్ ద్వారా జట్టు కూర్పుపై ఓ అవగాహనకు రావచ్చని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. చివరిసారిగా గత సెప్టెంబర్‌లో ప్యూర్టొరికోతో మ్యాచ్ ఆడిన భారత్ ఆమ్యాచ్‌లో 4–1తో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ గురుప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో అన్ని విభాగాల్లో రాణించిన భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు భారత్ చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మయన్మార్‌తో జరిగే క్వాలిఫయర్స్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్‌లో విజయం చాల ముఖ్యమని జట్టు భావిస్తోంది. మరోవైపు కాంబోడియా రికార్డు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. చివరిసారిగా గత జనవరిలో సౌదీ అరేబియాతో ఆడిన కాంబోడియా 2–7తో చిత్తుగా ఓటమిపాలైంది. మరోవైపు గత ఐదు మ్యాచ్‌ల్లోనూ కాంబోడియా గెలుపు రుచి చూడలేదు. దీంతో ఈమ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.