Breadcrumb
Live Updates
ఐదో సారి అండర్-19 ప్రపంచకప్ చాంపియన్స్‌గా భారత్
ఐసీసీ అండర్-19 2022 ప్రపంచకప్ విజేత భారత్
అండర్-19 ప్రపంచకప్ 2022 విజేతగా భారత్ నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 190 పరుగుల లక్ష్యాన్ని యంగ్ ఇండియా మరో 2 బంతులు మిగిలిఉండగా చేధించింది. అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడం ఇది ఐదోసారి కావడం విశేషం. భారత్ బ్యాటింగ్‌లో నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజ్ బవా 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ సేల్స్, బోయ్డెన్, అస్పిన్‌వాల్ తలా రెండు వికెట్లు తీశారు.
అంతకముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. టూ డౌన్ బ్యాటర్ జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన పోరాటంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్(31)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రూ.. 5 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
విజయానికి 21 పరుగులు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
విజయానికి చేరువవుతున్న క్రమంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రాజ్ బవా(35) జోషువా బోయ్డెన్ బౌలింగ్‌లో టామ్ ప్రీస్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత్ విజయానికి 21 పరుగుల దూరంలో ఉంది.
నిలకడగా భారత్ ఇన్నింగ్స్.. విజయానికి 57 పరుగుల దూరంలో
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విజయానికి 57 పరుగుల దూరంలో ఉంది. నిషాంత్ సింధు (22), రాజ్ బవా(16) పరుగులతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య 36 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.ప్రస్తుతం భారత్ స్కోరు 37 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 133 పరుగులుగా ఉంది.
బిగ్ వికెట్ కోల్పోయిన భారత్.. యష్ ధుల్(17) ఔట్
కెప్టెన్ యష్ ధుల్(17) రూపంలో భారత్ బిగ్ వికెట్ కోల్పోయింది. జేమ్స్ సేల్స్ బౌలింగ్‌లో ధుల్ జార్జీ బెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జేమ్స్సేల్స్ తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. భారత్ విజయానికి 93 పరుగులు దూరంలో ఉంది.
షేక్ రషీద్(50) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్
వైస్ కెప్టెన్ షేక్ రషీద్ అర్థసెంచరీ చేసిన వెంటనే ఔటవ్వడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన షేక్ రషీద్ జేమ్స్ సేల్స్ బౌలింగ్‌లో జేమ్స్ రూకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం యంగ్ ఇండియా 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. యష్ ధుల్ 17, నిషాంత్ సింధు క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 95 పరుగుల దూరంలో ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఓపెనర్ హర్నూర్ సింగ్(21) రూపంలో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అస్పిన్‌వాల్ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ అలెక్స్ హార్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం యంగ్ ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(28), యష్ ధుల్(2) క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 33/1
ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్‌ను ప్రస్తుతం ఓపెనర్ హర్నూర్ సింగ్, వన్‌డౌన్ షేక్ రషీద్‌లు నడిపిస్తున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ రఘువంశీ పరుగులేమి చేయకుండా డకౌట్ వెనుదిరిగాడు
తొలి వికెట్ కోల్పోయిన భారత్
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోని గట్టిషాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రఘువంశీ.. జోషువా బోయ్డెన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
చెలరేగిన భారత పేసర్లు.. 189 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. టూ డౌన్ బ్యాటర్ జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన పోరాటంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్(31)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రూ.. 5 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. 44 ఓవర్ల తర్వాత 185/9
యంగ్ ఇండియా పేసర్ రవికుమార్.. ఇంగ్లండ్‌ను మరో దెబ్బ కొట్టాడు. 93 పరుగుల భారీ భాగస్వామ్యం అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. దినేశ్ బనాకు క్యాచ్ ఇచ్చి అస్పిన్‌వాల్(0) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 44 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 185/9గా ఉంది.
బ్రేక్ ఇచ్చిన రవికుమార్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌పై దాదాపుగా ఆశలు వదులుకున్న ఇంగ్లండ్‌ను టూ డౌన్ బ్యాటర్ జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన పోరాటంతో ఆదుకున్నాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్(31)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 43.1వ ఓవర్లో రవికుమార్ బౌలింగ్‌లో కుశాల్ తాంబేకు క్యాచ్ ఇచ్చి రూ ఔటయ్యాడు. ఈ సమయానికి జట్టు స్కోర్ 184/8గా ఉంది. క్రీజ్‌లో జేమ్స్ సేల్స్, అస్పిన్వల్ ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
25వ ఓవర్లో 91 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆఫ్ స్పిన్నర్ కుశాల్ తాంబే బౌలింగ్‌లో యశ్ ధుల్‌కు క్యాచ్ ఇచ్చి అలెక్స్ హార్టన్(21 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటయ్యాడు. క్రీజ్‌లో జేమ్స్ రూ(37), జేమ్స్ సేల్స్ ఉన్నారు.
రాజ్ బవా విశ్వరూపం.. 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
Wicket No. 4⃣ for Raj Bawa 👏 👏
— BCCI (@BCCI) February 5, 2022
6⃣th success with the ball for India U19 in the Final 👌 👌
Follow the match ▶️ https://t.co/p6jf1AXpsy#U19CWC #BoysInBlue #INDvENG pic.twitter.com/j6d6EfziIX
రైట్ ఆర్మ్ మీడియం పేసర్ రాజ్ బవా(4/14) ధాటికి ఇంగ్లండ్ జట్టు చిగురుటాకులా వణికిపోతుంది. 61 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కుశాల్ తాంబే క్యాచ్ పట్టడంతో రెహాన్ అహ్మద్(12 బంతుల్లో 10; ఫోర్) వెనుదిరిగాడు. క్రీజ్‌లో జేమ్స్ రూ(17), అలెక్స్ హార్టన్ ఉన్నారు.
చెలరేగుతున్న భారత పేసర్లు.. 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
యంగ్ ఇండియా పేసర్లు రవికుమార్(2/11), రాజ్ బవా(3/9)ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ పేక మేడాలా కూలింది. 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 13వ ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించిన రాజ్ బవా.. వరుస బంతుల్లో వికెట్లు తీసి ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీశాడు. దినేశ్ బనా చేతికి చిక్కి లక్స్టన్(8 బంతుల్లో 4) పెవిలియన్‌కు చేరగా.. సెమీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన జార్జ్ బెల్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు 10.1వ ఓవర్లో ఓపెనర్ జార్జ్ థామస్(30 బంతుల్లో 27; 4 ఫోర్లు, సిక్స్)ను కూడా రాజ్ బవానే పెవిలియన్‌కు పంపాడు. 37 పరుగుల వద్ద థామస్.. కెప్టెన్ యశ్ ధుల్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. క్రీజ్‌లో జేమ్స్ రూ(13), రెహాన్ అహ్మద్ ఉన్నారు.
రవికుమార్ విజృంభణ.. ఇంగ్లండ్ కెప్టెన్ క్లీన్ బౌల్డ్
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు.. నాలుగో ఓవర్లో మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టామ్ ప్రెస్ట్.. రవికుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్ 18 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో జార్జ్ థామస్(16), జేమ్స్ రూ ఉన్నారు.
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ బెతెల్(5 బంతుల్లో 2)ను రవికుమార్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఫలితంగా ఇంగ్లండ్ 4 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 4/1గా ఉంది. క్రీజ్‌లో జార్జ్ థామస్(2), టామ్ ప్రెస్ట్ ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
అండర్-19 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇవాళ జరుగుతున్న మెగా ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Related News By Category
Related News By Tags
-
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన...
-
తయారీపై ‘టారిఫ్‌ల’ ప్రభావం
తయారీ రంగం పనితీరు నవంబర్‌లో కొంత బలహీనపడింది. తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరింది. తయారీ రంగం పనితీరును సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.6 పాయింట్లకు ప...
-
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజ...
-
ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్...
-
WTC: ఒక్క మ్యాచ్‌తో మారిన పాక్ రాత.. టీమిండియాకు బూస్ట్!
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్ (PAK vs SA 2nd Test) ఓటమి పాలైంది. రావల్పిండి వేదికగా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు... ఆతిథ్య పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధిం...


