బంగ్లాదేశ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ | Towhid Hridoy Named Bangladesh T20 Captain For Zimbabwe Series As Litton Das Takes Break | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

Jul 2 2026 9:53 AM | Updated on Jul 2 2026 10:13 AM

Towhid Hridoy becomes Bangladesh captain for ZIM T20Is

బంగ్లాదేశ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ వచ్చాడు. త్వరలో​ జింబాబ్వేతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం తౌహిద్‌ హృదోయ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించబడ్డాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి సెలవు తీసుకోవడంతో హృదోయ్‌కు ఈ బాధ్యత అప్పగించారు. జింబాబ్వేతో సిరీస్ జులై 15, 17, 19 తేదీల్లో బులవాయో వేదికగా జరగనుంది.

ఈ సిరీస్ కోసం కెప్టెన్‌ సహా 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును నిన్న ప్రకటించారు. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ మొసద్దక్‌ హొసేన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో అతను 157 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.

మరోవైపు యాసిర్ అలీ సుమారు మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని తీసుకున్నారు.

అయితే షమీమ్‌ హొసేన్‌ను మాత్రం ఫామ్ కోల్పోవడంతో ఈ సిరీస్‌కి విశ్రాంతి ఇచ్చారు. గత 9–10 ఇన్నింగ్స్‌లలో రన్స్ చేయలేకపోవడం దీనికి కారణంగా సెలెక్టర్లు తెలిపారు.

ఈ కొత్త నాయకత్వంలో బంగ్లాదేశ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి. యువ కెప్టెన్ హృదోయ్‌కు ఇది తన కెరీర్‌లో తొలి పెద్ద బాధ్యతగా మారనుంది.

బంగ్లాదేశ్ టీ20 జట్టు: తౌహిద్ హృదోయ్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, మొసద్దెక్ హొస్సేన్ సైకత్, యాసిర్ అలీ చౌదరి, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాఫ్ అహ్మద్, రిషాఫ్ అహ్మద్ రెహమాన్, నహిద్ రాణా, ఎండీ సైఫుద్దీన్‌, అబ్దుల్ గఫార్ సక్లైన్.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement