IND vs AFG: చెలరేగిన బ్యాటర్లు.. భారత్‌ భారీ స్కోరు | Three Indian Batters Half Centuries India-A Big Score Vs AFG-A ODI | Sakshi
Sakshi News home page

IND-A Vs AFG-A: ఫిఫ్టీల‌తో చెల‌రేగిన బ్యాట‌ర్లు.. ఇండియా-ఏ భారీ స్కోరు

Jun 17 2026 1:57 PM | Updated on Jun 17 2026 2:13 PM

Three Indian Batters Half Centuries India-A Big Score Vs AFG-A ODI

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 319 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య (58), కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (59), కుమార్ కుషాగ్ర (58) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు. ఆఫ్గ‌న్ బౌల‌ర్ల‌లో ఫ‌రీదూన్, ఫర్మానుల్లా, అబ్దుల్లా అహ్మ‌ద్‌జ‌య్ తలా 2 వికెట్లు తీశారు.

ఐపీఎల్‌లో ఆక‌ట్టుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ ట్రై సిరీస్‌లో మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. 28 బంతుల్లో 38 ప‌రుగులు చేసిన వైభ‌వ్ నిరాశ‌ప‌రిచాడు. మ‌రో ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య నిల‌క‌డ ప్ర‌ద‌ర్శించి అర్థ‌సెంచ‌రీ సాధించ‌డంతో పాటు రుతురాజ్ (30) ప‌ర్వాలేద‌నిపించ‌డంతో భార‌త్ ర‌న్‌రేట్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 

రుతురాజ్, ప్రియాన్ష్‌లు ఔటైన త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ‌, కుమార్ కుషాగ్రలు భార‌త ఇన్నింగ్స్‌ను న‌డిపించారు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు 114 ప‌రుగులు జోడించారు. ఫిఫ్టీలు పూర్తి చేసుకున్న అనంత‌రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వెనుదిరిగారు. ఈ క్ర‌మంలో నిషాంత్ సింధు (21 నాటౌట్‌), విప్ర‌జ్ నిగ‌మ్ (30) మెరుపుల‌తో ఇండియా-ఏ స్కోరు 300 మార్క్‌ను దాటింది.

Read: చరిత్రకు అడుగుదూరంలో గిల్‌.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement