భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో కీలక మార్పు | three of the five T20I matches between India and England were moved to a 10 pm IST start time instead of 11 pm IST | Sakshi
Sakshi News home page

భారత్‌-ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో కీలక మార్పు

Jun 8 2026 9:21 PM | Updated on Jun 8 2026 9:21 PM

three of the five T20I matches between India and England were moved to a 10 pm IST start time instead of 11 pm IST

త్వరలో స్వదేశంలో భారత్‌తో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను మార్చింది.

వాస్తవానికి ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్‌కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్‌లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్‌కు చెందిన స్కై స్పోర్ట్స్‌, భారత్‌కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో ECB సంప్రదింపులు జరిపింది.

కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్‌ అ‍య్యర్‌ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్‌కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement