మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌ బోణీ | Thailand beat Hong Kong by 6 runs in Asia Cup T20 cricket tournament | Sakshi
Sakshi News home page

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌ బోణీ

Aug 29 2026 3:37 AM | Updated on Aug 29 2026 3:37 AM

Thailand beat Hong Kong by 6 runs in Asia Cup T20 cricket tournament

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో థాయ్‌లాండ్‌ బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ జట్టు 6 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కెపె్టన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నరుమోల్‌ చాయ్‌వై (31 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. 

హాంకాంగ్‌ బౌలర్లలో మరీనా 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హాంకాంగ్‌ తడబడింది. ఒక దశలో 84/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హాంకాంగ్‌ జట్టు... చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. కారీ చాన్‌ (28; 4 ఫోర్లు), యాస్మీన్‌ (28; 2 ఫోర్లు), మరీనా (11 బంతుల్లో 22; 4 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో యూఏఈతో శ్రీలంక తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement