దుబాయ్: నేటి నుంచి మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేసియా, యూఏఈ జట్లున్నాయి. నేడు జరిగే తొలి పోరులో హాంకాంగ్‌తో థాయ్‌లాండ్ తలపడనుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం థాయ్‌లాండ్‌తో... సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో ... సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌తో ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్... సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్...సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతాయి. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. సోనీ స్పోర్ట్స్ చానెల్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.


