న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు రికార్డు స్థాయి టికెట్ విక్రయాలు
48 గంటల్లోనే 26 వేల టికెట్ల అమ్మకం
వెల్లింగ్టన్: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తనున్నారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26 వరకు న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య కివీస్‌తో ఐదు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సంబంధించి ప్రీ–సేల్ ప్రారంభించగా... రికార్డు స్థాయిలో ముందస్తు బుకింగ్‌లు జరిగాయి. రెండు రోజుల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఆక్లాండ్ వేదికగా జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు భారీ స్పందన రాగా... క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్టన్‌లో జరగనున్న మ్యాచ్‌లు చూసేందుకు కూడా అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా టి20, వన్డే మ్యాచ్‌లకు టికెట్లు పూర్తిగా అమ్ముడవుతాయని అంచనా. పర్యటన ప్రారంభానికి ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారి గ్లెన్ క్రిచ్లీ అభిమానులకు సూచించగా... దీనికి భారీ స్పందన వచ్చింది. ‘ప్రీ–సేల్‌కు విశేష స్పందన వస్తోంది.
తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయి టికెట్లు అమ్ముడయ్యాయి. టికెట్ ధరలను పెంచకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అభిమానులు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవడం ఆనందంగా ఉంది. మరో 11 రోజుల పాటు టికెట్ల అమ్మకం చేపడతాం’ అని కివీస్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.


