గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్‌.. ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్‌.. ఎప్పుడంటే?

Published Thu, Jan 18 2024 7:18 PM

Telugu Titans Bengaluru Bulls Pro Kabaddi League match At Gachibowli Indoor - Sakshi

  క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్‌ సీజన్‌ 10లో తమ హోమ్ మ్యాచ్‌లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్‌ తలపడనుంది. హోమ్‌ మ్యాచ్‌లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి.

తెలుగు టైటాన్స్ సీఈఓ  త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలబోతుందన్నారు.  తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో  పాటుగా  కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు.

తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్‌ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement