భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఆ స్ధానంలో శ్రేయస్ అయ్యర్‌ను నూతన సారధిగా నియమించింది.
సూర్యను కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. అదేవిధంగా ఇటీవల పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌లను కూడా టీ20 జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన వెటరన్ భువనేశ్వర్ కుమార్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్‌లను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక కాని భారత స్టార్ ఆటగాళ్లతో కూడా ప్రత్యామ్నాయ జట్టును ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశమిచ్చారు. అదేవిధంగా గిల్,రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నాడు.
అన్‌సెలక్టెడ్ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టు
శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ


