Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?!  | T20 World Cup 2021 Ind Vs NZ: Can India Qualify Semis After Big Loss How | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! 

Nov 1 2021 8:47 AM | Updated on Nov 1 2021 10:49 AM

T20 World Cup 2021 Ind Vs NZ: Can India Qualify Semis After Big Loss How - Sakshi

PC: BCCI

ఇన్ని లెక్కలా... ఒక రకంగా టి20 ప్రపంచ కప్‌లో మన ఆట ముగిసినట్లే!

T20 World Cup 2021- Can India Qualify Semis After Big Loss How: న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా అధికారికంగా భారత జట్టు ఇంకా టోర్నీనుంచి నిష్క్రమించలేదు. 14.3 ఓవర్లలోనే మ్యాచ్‌ కొట్టేయడంతో భారత్‌ రన్‌రేట్‌ ఘోరంగా పడిపోయింది. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా అంకెల్లో మాత్రం ఇంకా టీమ్‌కు అవకాశముంది! నమీబియా, స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లను మన కోణంలో ఏకపక్ష విజయాలుగా భావిస్తే బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే సమరమే కీలకం కానుంది.

టోర్నీలో అఫ్గాన్‌ ఆడుతున్న తీరు చూస్తే ఆ జట్టు సంచలనానికి కూడా అవకాశముంది. అయితే భారత్‌ తమ ‘స్థాయి’కి తగ్గ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి... అఫ్గాన్‌ టీమ్‌ న్యూజిలాండ్‌ను ఓడిస్తేనే మన టీమ్‌ అసలు సమీకరణాల లెక్కలోకి వస్తుంది. అప్పటికీ కూడా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఒక వీరాభిమాని తరహాలో కాకుండా నిజాయితీగా ఆలోచిస్తే ఇన్ని లెక్కలను దాటి భారత్‌ ముందంజ వేయడం దాదాపు అసాధ్యం. ఒక రకంగా టి20 ప్రపంచ కప్‌లో మన ఆట ముగిసినట్లే!

స్కోర్లు: 
ఇండియా- 110/7 (20)
న్యూజిలాండ్‌- 111/2 (14.3)

చదవండి: Virat kohli: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. అయితే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement