
Gautam Gambhir Slams Team India After Loss Against New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కివీస్‌తో కీలక మ్యాచ్‌కు కోహ్లి సేన రాంగ్ మైండ్ సెట్‌తో బరిలోకి దిగిందని, నాలుగు శతకాలు బాదిన రోహిత్ శర్మను ఓపెనర్‌గా కాకుండా వన్ డౌన్‌లో ఎలా ఆడిస్తారని ధ్వజమెత్తాడు. జట్టులోని ఆటగాళ్లకు నైపుణ్యమున్నా.. మానసిక స్థైర్యం కొరవడిందని, ఆ కారణంగానే కివీస్ చేతిలో చిత్తు అయ్యిందని అభిప్రాయపడ్డాడు.
సాధారణ మ్యాచ్‌ల్లో చెలరేగిపోయే కోహ్లి సేనకు కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం అలవాటుగా మారిందని అసహనం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లి అనుసరించిన వ్యూహాలను ఏకి పారేశాడు. 112 మ్యాచ్‌ల కెరీర్‌లో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ను...కీలక మ్యాచ్‌లో ఆ స్థానంలో ఎలా ఆడిస్తారని నిలదీశాడు. టాస్ ఓడి ఆదిలోనే సగం మ్యాచ్‌ను చేజార్చుకున్న కోహ్లి.. నెగిటివ్ థింకింగ్(రోహిత్‌ను వన్ డౌన్‌లో ఆడించడం)తో టీమిండియాను చేజేతులా ఓడించాడని మండిపడ్డాడు.
కాగా, ప్రస్తుత టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్(10 వికెట్ల తేడాతో ఓటమి) చేతిలో, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్(8 వికెట్ల తేడాతో ఓటమి) చేతిలో ఓటమిపాలై సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న సంగతి తెలిసిందే. టోర్నీలో టీమిండియా తదుపరి ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-2లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమే.
చదవండి: వాళ్లేమీ రోబోలు కాదు.. ప్రతి మ్యాచ్ గెలవడానికి, అండగా నిలవండి..!