మెంటార్‌గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్‌  | T20 World Cup 2021:Dhoni Started Work After Shardul Thakur India Squad | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: మెంటార్‌గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్‌ 

Oct 13 2021 7:58 PM | Updated on Oct 17 2021 4:25 PM

T20 World Cup 2021:Dhoni Started Work After Shardul Thakur India Squad - Sakshi

Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్‌గా ఎంఎస్‌ ధోని ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెంటార్‌గా ధోని తన పనిని ప్రారంభించాడంటూ ఫ్యాన్స్‌ మీమ్స్‌, ట్రోల్‌ చేస్తున్నారు. అదేంటి.. ఇంకా టి20 ప్రపంచకప్‌ ఆరంభం కాకముందే ధోని ఎలా ప్రారంభించాడని సందేహ పడకండి. తాజాగా శార్దూల్‌ ఠాకూర్‌ .. అక్షర్‌ పటేల్‌ స్థానంలో టి20 ప్రపంచకప్‌ టీమిండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ అన్‌ఫిట్‌..  జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌!

దీనివెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ సీఎస్‌కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్‌కే  ఈ సీజన్‌లో ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే ఆడిన 15 మ్యాచ్‌ల్లో శార్దూల్‌ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్‌కు ప్లస్‌గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్‌కే ఫ్యాన్స్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్‌పై ఫ్యాన్స్‌ ఫన్నీ మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. లార్డ్‌ శార్దూల్‌ ఈజ్‌ బ్యాక్‌.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్‌ చేయలేదు.. అతని టాలెంట్‌తో ఎంపికయ్యాడు.. ధోని మెంటార్‌గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

Advertisement
 
Advertisement
Advertisement