T20 WC 2022 Final: హేల్స్‌ రెచ్చిపోతే.. పాక్‌ ఒట్టి చేతులు ఊపుకుంటూ ఇంటి దారి పట్టాల్సిందే..!

T20 WC 2022 Final: If Alex Hales Continues Form, England Can Defeat Pakistan Easily - Sakshi

ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య రేపు (నవంబర్‌ 13) జరిగే టీ20 వరల్డ్‌కప్‌-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వ శక్తులు ఓడ్డనున్నాయి. హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న ఫైనల్లో దాయాది పాక్‌ సెంటిమెంట్లను నమ్ముకుంటే.. ఇంగ్లండ్‌ మాత్రం ప్రతిభపైనే ఆధాపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అదృష్టం కొద్దీ ఫైనల్‌ దాకా వచ్చిన పాక్‌.. 1992 వన్డే వరల్డ్‌కప్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందని ధీమా ఉంటే, ఇంగ్లండ్‌.. పాక్‌ అంచనాలను తల్లకిందులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో నాసిరకమైన ప్రదర్శనతో నెట్టుకొచ్చిన పాక్‌.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ ఇంటి దారి పట్టాల్సింది వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు.

మరోపక్క, ఇంగ్లండ్‌.. ప్రస్తుత టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉంది. ఒక్క ఐర్లాండ్‌ చేతిలో పరాభవం తప్పించి, దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆట ఆడింది. అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా రాణించింది. ఇదే ఫామ్‌ను బట్లర్‌ సేన టైటిల్‌ పోరులోనూ కొనసాగిస్తే.. పాక్‌ పరాజయాన్ని అడ్డుకోవడం దాదాపుగా ఆసాధ్యమేనని చెప్పాలి. ముఖ్యంగా భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ మరోసారి చెలరేగితే పాక్‌ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. 

ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో హేల్స్‌.. 84, 52, 47, 86 నాటౌట్‌ పరుగులు సాధించి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు భారత్‌తో జరిగిన సెమీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మార్క్‌ వుడ్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో మరింత పటిష్టంగా మారుతుంది. మొత్తంగా ఇరు జట్ల బలాబలాలను పోలిస్తే.. పాక్‌పై ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని చెప్పాలి.  
చదవండి: ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలిస్తే, బాబర్‌ ఆజమ్‌ ప్రధాని అవుతాడు..!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top