స్వియాటెక్‌ శుభారంభం | Swiatek off to a good start in the WTA Finals | Sakshi
Sakshi News home page

స్వియాటెక్‌ శుభారంభం

Nov 4 2024 4:02 AM | Updated on Nov 4 2024 4:02 AM

Swiatek off to a good start in the WTA Finals

రియాద్‌: మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌  చాంపియన్, పోలాండ్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ శుభారంభం చేసింది. ఆరెంజ్‌ గ్రూప్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ స్వియాటెక్‌ 4–6, 7–5, 6–2తో ఎనిమిదో సీడ్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై కష్టపడి గెలిచింది. 

2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్‌ పది ఏస్‌లు సంధించింది. ఆరెంజ్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 6–3, 6–2తో అమెరికాకే చెందిన జెస్సికా పెగూలాను ఓడించింది. పర్పుల్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ జాస్మిన్‌ పావోలిని (ఇటలీ) 7–6 (7/5), 6–4తో రిబాకినా (కజకిస్తాన్‌)పై గెలిచింది.    

Advertisement
 
Advertisement
Advertisement