స్వియాటెక్‌ ముందంజ | Defending champion Swiatek advances to third round at Wimbledon | Sakshi
Sakshi News home page

స్వియాటెక్‌ ముందంజ

Jul 3 2026 2:25 AM | Updated on Jul 3 2026 2:25 AM

Defending champion Swiatek advances to third round at Wimbledon

మూడో రౌండ్‌కు జొకోవిచ్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌

లండన్‌: గ్రాస్‌కోర్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో స్వియాటెక్‌ 6–1, 6–3 స్కోరుతో కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై అలవోక విజయం సాధించింది. 70 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్వియాటెక్‌ ముందు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నిలవలేకపోయింది. 

2024 చాంపియన్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా మూడో రౌండ్‌కు చేరింది. తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ మిరా ఆండ్రీవా (రష్యా)తో జరిగిన పోరులో క్రెజికోవా 4–6, 7–5, 6–4తో నెగ్గింది. 2 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు క్రెజికోవా తన అనుభవంతో పైచేయి సాధించింది.

పురుషుల విభాగంలో ఏడు సార్లు వింబుల్డన్‌ 
చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తన 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు. రెండో రౌండ్‌లో అతడు 6–3, 6–4, 6–2తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై అలవోక విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. రెండో సీడ్, ప్రస్తుత ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–1, 6–3, 7–6 (7/3)తో రోయర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌లలో ఆరో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా), ఐదో సీడ్‌ అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా) గెలిచారు. ఫ్రిట్జ్‌ 6–2, 6–2, 7–5తో కిప్సన్‌ (అమెరికా)పై, డి మినార్‌ 6–3, 6–2, 6–2తో ఆడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement