Suryakumar Yadav: టెస్టు క్రికెట్‌పై సూర్య కుమార్‌ కన్ను.. అందుకోసం మాస్టర్‌ ప్లాన్‌!

Suryakumar Yadav makes himself available for Mumbai second Ranji game - Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఇప్పుడు టెస్టు క్రికెట్‌పై కన్నేశాడు. బం‍గ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ దేశీవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో అద్భుతంగా రాణించి భారత టెస్టు క్రికెట్‌లోకి సూర​ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సూర్య ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు 13న వైజాగ్‌ వేదికగా ఆంధ్రాతో జరిగే తొలి మ్యాచ్‌కు సూర్య దూరంగా ఉండనున్నాడు. కాగా  డిసెంబర్ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే ముంబై రెండో మ్యాచ్‌కు సూర్య జట్టుతో చేరనున్నట్లు మహారాష్ట్ర క్రికెట్‌ ఆసోషియన్‌ సెక్రటరీ అజింక్యా నాయక్ తెలిపారు.

"సూర్య గత కొన్ని రోజులుగా టీమిండియా తరపున వైట్‌బాల్‌ క్రికెట్‌లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు బాగా అలిసిపోయాడు. అందుకే చిన్న విరామం తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రాతో జరిగే మా తొలి మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నాడు.

మళ్లీ అతడు ఫ్రెష్‌ మైండ్‌తో జట్టులో చేరుతాడు. డిసెంబర్‌ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే మా రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ భాగం అవుతాడు" అని అజింక్యా నాయక్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 77 మ్యాచ్‌లు ఆడిన సూర్య 5326 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్‌ సెంచరీతో పాటు 14 సెంచరీలు, 26 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL Mini Auction: అతడి కోసం లక్నో పోటీ పడుతుంది! సీఎస్‌కే కూడా: అశ్విన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top