సూర్యకుమార్‌ విధ్వంసం.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం | Surya, Rinku power India to two wicket win in high-scoring thriller | Sakshi
Sakshi News home page

IND vs AUS: సూర్యకుమార్‌ విధ్వంసం.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

Published Thu, Nov 23 2023 11:10 PM | Last Updated on Fri, Nov 24 2023 9:24 AM

Surya, Rinku power India to two wicket win in high-scoring thriller - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. 

భారత బ్యాటర్లలో స్టాండింగ్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌(58), రింకూ సింగ్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖరిలో రింకూ సూపర్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లో సంఘా రెండు వికెట్లు పడగొట్టగా.. అబాట్‌, బెహ్రెండార్ఫ్, షార్ట్‌  తలా వికెట్‌ సాధించారు.

ఆఖరి ఓవర్‌లో హైడ్రామా..
చివరి ఓవర్‌లో భారత విజయానికి 7 పరుగులు ​ కావాల్సిన సమయంలో రింకూ తొలి బంతిని బౌండరీగా మలిచాడు.. దీంతో 5 బంతుల్లో గెలుపు  కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. రెండో బంతికి సింగిల్‌ తీసి అక్షర్‌కు రింకూ స్ట్రైక్‌ ఇచ్చాడు. అయితే అక్షర్‌ మాత్రం భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు.

దీంతో ఆఖరి మూడు బంతుల్లో భారత్ గెలుపుకు రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్‌ నాలుగో బంతిని సింగిల్‌ తీసి రింకూకు స్ట్రైక్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రింకూకు స్ట్రైక్‌ ఇచ్చే ప్రయత్నంలో బిష్ణోయ్‌ రనౌటయ్యాడు. ఐదో బంతిని లాంగ్‌ ఆన్‌ దిశగా ఆడిన రింకూ రెండో పరుగు కోసం ట్రై చేశాడు.

ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ రనౌటయ్యాడు. అయితే ఆఖరి బంతికి భారత విజయానికి ఒక్కపరుగు అవసరమైంది.  స్ట్రైక్‌లో ఉన్న రింకూ చివరి బంతిని సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అయితే ఆసీస్‌ బౌలర్‌ అబాట్‌ నోబాల్‌గా వేయడంతో రింకూ కొట్టిన సిక్స్‌ను పరిగణలోకి తీసుకోలేదు.

ఇక అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లీష్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్‌ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్‌ స్మిత్‌(52), డేవిడ్‌ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement