సెమీఫైనల్లో శ్రీకాంత్‌  | Srikanth in the semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో శ్రీకాంత్‌ 

Feb 27 2023 3:02 AM | Updated on Feb 27 2023 3:02 AM

Srikanth in the semifinals - Sakshi

పుణే: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ శ్రీకాంత్‌ 21–10, 18–21, 21–16 స్కోరుతో కార్తికేయ కుమార్‌పై విజయం సాధించాడు.

ఇతర పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, హర్షీల్‌ దాని, మిథున్‌ మంజునాథ్‌ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీ జంట సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

క్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా 21–16, 21–12 తేడాతో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, అస్మిత చలీహ సెమీస్‌ చేరుకున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హేమనాగేంద్ర–కనికా కన్వాల్‌ జోడి సెమీస్‌ చేరుకుంది. ఇషాన్‌ భట్నాగర్  –తనీషా క్రాస్టో జంట వీరికి వాకోవర్‌ ఇచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement