Michael Rippon: సౌతాఫ్రికాలో పుట్టి నెదర్లాండ్స్‌ తరపున ఆడి; తాజాగా కివీస్‌కు

South Africa Cricketer Joins New Zealand Creates Unique World Record - Sakshi

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మైకెల్‌ రిప్పన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ సందర్భంగా రెండు దేశాల తరపున(న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌) అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. విషయంలోకి వెళితే.. మైకెల్‌ రిప్పన్‌ సౌతాఫ్రికాలో జన్మించాడు. తన చిన్నతనంలోనే కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లింది. ఇక రిప్పన్‌ నెదర్లాండ్స్‌లో క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్నాడు.

2012లో తొలిసారి కౌంటీ క్రికెట్‌ ఆడిన మైకెల్‌ రిప్పన్‌ 2013లో నెదర్లాండ్స్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. డచ్‌ జట్టు తరపున 9 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇటీవలే కుటుంబంతో న్యూజిలాండ్‌లో స్థిరపడిన మైకెల్‌ రిప్పన్‌ స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కివీస్‌ తరపున డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. అలా ఏకకాలంలో రెండు దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టి20 క్రికెట్‌లో రెండు దేశాల తరపున ఆడిన 14వ క్రికెటర్‌గా మైకెల్‌ రిప్పన్‌ రికార్డులకెక్కాడు.

ఇక టి20 ప్రపంచకప్‌లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్‌ జట్టు గ్రూఫ్‌-1లో ఉండగా.. గ్రూఫ్‌-2 తను పుట్టిన దేశం సౌతాఫ్రికాతో పాటు తాను మొదటగా ఆడిన నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. సౌతాఫ్రికాకు తమ తొలి మ్యాచ్‌ వర్షర్పాణం కాగా.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక న్యూజిలాండ్‌ జట్టు ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంది. ఇక కివీస్‌ రెండో మ్యాచ్‌ మాత్రం వర్షార్పణం అయింది. 

చదవండి: టి20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న వరుణుడు.. 

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top