36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్‌ రికార్డు | Sophie Devine Hits Fastest Century | Sakshi
Sakshi News home page

36 బంతుల్లోనే శతకం...ఫాస్టెస్ట్‌ రికార్డు

Jan 16 2021 8:49 AM | Updated on Jan 16 2021 8:49 AM

Sophie Devine Hits Fastest Century - Sakshi

డ్యునెడిన్‌: న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ టి20 టోర్నమెంట్‌లో వెల్లింగ్టన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సోఫీ డివైన్‌ (38 బంతుల్లో 108 నాటౌట్‌; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) రికార్డు సెంచరీతో అదరగొట్టింది. 36 బంతుల్లోనే సెంచరీ బాది మహిళల టి20 క్రికెట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొలి్పంది. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ ప్లేయర్‌ డియోండ్ర డాటిన్‌ (38 బంతుల్లో దక్షిణాఫ్రికాపై 2010లో) పేరిట ఉండేది. (లంచ్‌కు ముందే ఆసీస్‌ ఆలౌట్‌)

డివైన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఒటాగో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌ జట్టు 10 వికెట్లతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత ఒటాగో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంతరం వెల్లింగ్టన్‌ జట్టు 8.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 131 పరుగులు చేసి గెలుపొందింది. కెపె్టన్‌ మ్యాడీ గ్రీన్‌ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించింది. తాజా శతకంతో సోఫీ డివైన్‌ మహిళల టి20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (6) చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌–5), అలీసా హీలీ (ఆస్ట్రేలియా–5) రెండో స్థానానికి పడిపోయారు. (పంత్‌ మొత్తుకున్నా నమ్మలేదు..)

Advertisement
 
Advertisement
Advertisement