ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్‌ 1 స్థానానికి చేరువలో!

Smriti Mandhana Rises To Career Best 2nd Position In T20Is - Sakshi

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మరోసారి దుమ్మురేపింది. తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను మం​ధాన సాధించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంధాన అదరగొట్టింది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆమె 111 పరుగులు సాధించింది.

ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఆమె రెండు స్థానాలు ఎగబాకి టాప్‌ ర్యాంక్‌కు చేరువైంది. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో మం​ధాన సత్తా చాటింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు ఈ భారత స్టార్‌ ఓపెనర్‌ చేరుకుంది.

కాగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన తొలి వన్డేలో 91 పరుగులు చేసి భారత విజయంలో మం​ధాన కీలక పాత్ర పోషించింది. అదే విధంగా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగు స్ధానాలు ఎగబాకి  9వ స్థానానికి చేరుకుంది.
చదవండి: CSA T20 League: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమాకు ఘోర అవమానం! ఎందుకిలా జరిగిందో చెప్పిన మాజీ ఆల్‌రౌండర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top