Mohammed Siraj: మహ్మద్‌ సిరాజ్‌ గురువు ఆయనే!

 Siraj Success Has A Lot To Do With Bharat Arun Says Sivaramakrishnan - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న పేసర్​ మహ్మద్​ సిరాజ్​  విజయంలో టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్‌ కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్​ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా వ్యవరించినప్పడే సిరాజ్ ప్రతిభను  భరత్‌ అరుణ్‌ గుర్తించాడని శివరామకృష్ణన్ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘సిరాజ్‌కు నేర్చుకోవాలనే తపనతో పాటు విజయవంతం అవ్వాలన్న పట్టుదల ఎక్కువే. భరత్‌ అతడికి ఎంతో  పరిజ్ఞానాన్ని అందించాడు' అని శివరామకృష్ణన్‌ పేర్కొన్నారు. కొందరు ఆటగాళ్లు కోచ్ సలహాను పాటించకపోవచ్చు కానీ సిరాజ్‌ మాత్రం భరత్ అరుణ్ ఏది చెప్పినా  దానిని అవ్యక్తంగా అనుసరించాడని ఆయన చెప్పారు.

చదవండి:IPL-2021: పంజాబ్ కింగ్స్ లోకి ఆసీస్‌ యువ పేసర్‌

కాగా, టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌.. 2016లో హైదరాబాద్‌ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అప్పడే.. సిరాజ్​  కోచ్‌ భరత్‌ అరుణ్‌ దృష్టిలో పడ్డాడు. ఒకరకంగా టీమిండియాకు సిరాజ్‌ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర అని చెప్పొచ్చు. కివీస్‌తో తొలి టీ20 తర్వాత ఆశిష్‌ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్‌ ఉనద్కత్‌ లేదా బాసిల్‌ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్‌ పాత్ర ఉందని శివరామకృష్ణన్ వెల్లడించారు.

చదవండి:Mohammed Siraj: సిరాజ్‌ సెలబ్రేషన్స్‌ వైరల్‌; హైదరాబాద్‌లో భారీ కటౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top