#MarnusLabhuschagne: 'చాన్స్‌ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్‌ దెబ్బకు లేచి కూర్చొన్నాడు

Siraj Given-No-Chance-Alert-Marnus Labhuschagne Immidiate Small-Nap - Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే పాపం పొద్దున నుంచి ఫీల్డింగ్‌ చేసి అలిసిపోయాడేమో తెలియదు కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో లబుషేన్‌ రిలాక్స్‌ అయ్యాడు.

కుర్చూన్న కుర్చీలోనే రిలాక్స్‌ అయ్యాడు. కళ్లు మూసుకుపోతుండడంతో చిన్న కునుకు తీయాలనకున్నాడు. కానీ సిరాజ్‌ లబుషేన్‌న్‌కు ఆ చాన్స్‌ కూడా ఇవ్వలేదు. లబుషేన్‌ అలా కునుకు తీస్తున్నాడో లేదో.. ఇక్కడ సిరాజ్‌ వార్నర్‌ను ఔట్‌ చేసేశాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ సిరాజ్‌ వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని వార్నర్‌ ఫ్లిక్‌ చేసే క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి కీపర్‌ భరత్‌ చేతుల్లో పడింది.

నిద్ర కళ్లతోనే చూసిన లబుషేన్‌ వార్నర్‌ ఔట్‌ అయ్యాడని తెలియగానే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. పాపం మంచిగా రెస్ట్‌ తీసుకుందామనుకున్నాడు..కానీ సిరాజ్‌ ఆ అవకాశం కూడా ఇ‍వ్వలేదుగా అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిరాజ్‌ దెబ్బకు నిద్రమత్తు పూర్తిగా పాయే..

ఇక వార్నర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్‌ నిద్రమత్తును సిరాజ్‌ తన బౌలింగ్‌తో పూర్తిగా తొలగించాడు. అదే ఓవర్‌లో ఐదో బంతిని సిరాజ్‌ బౌన్సర్‌ వేశాడు. లబుషేన్‌ ఫ్రంట్‌ఫుట్‌ వచ్చి షాట్‌ ఆడే యత్నంలో విఫలమయ్యాడు. అంతే బంతి వేగంగా వచ్చి వేలుకు బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్‌ వదిలేసి నొప్పితో అల్లాడిపోయాడు. ఈ దెబ్బతో కొన్ని సెకన్ల ముందు ఉన్న నిద్రమత్తు పూర్తిగా తొలిగిపోయి ఉండొచ్చు అని అభిమానులు పేర్కొన్నారు. 

చదవండి: 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top