County Championship: శుబ్‌మన్‌ గిల్‌ ర్యాంప్‌ షాట్‌.. వీడియో వైరల్‌

Shubman Gills Ramp Shot Off Faheem Ashraf In County Game - Sakshi

టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్‌.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ససెక్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గిల్‌ సెంచరీకి చేరువయ్యాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి గిల్‌ 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కాగా అతడి ఇన్నింగ్స్‌ను వన్డే మ్యాచ్‌ను తలపించేలా సాగింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో గిల్‌ ఆడిన ఓ షాట్‌ తొలి రోజు ఆటకే హైలట్‌గా నిలిచింది.

గ్లామోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్‌ వేసిన ఓ బౌన్సర్‌ బంతిని గిల్‌ అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను గ్లామోర్గాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ షేర్‌ చేసింది.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక  ఈ మ్యాచ్‌ అనంతరం గిల్‌ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆక్టోబర్‌ 6 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది.

చదవండి: Ind Vs Aus- Viral: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top