Ind Vs Aus- Viral: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే..

Ind Vs Aus: Teammates Force Reluctant Karthik To Lift Trophy Video Viral - Sakshi

Ind Vs Aus 3rd T20- Viral Video: టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉంది. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. 

ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఐదో బంతికి ఫోర్‌ బాదడంతో భారత్‌ విజయం ఖరారైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ టీమిండియా సొంతమైంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన సంబరాల్లో మునిగిపోయింది. 

గత కొంతకాలంగా వాళ్ల చేతికే! కానీ ఈసారి
ఇక బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ నుంచి ట్రోఫీ అందుకున్న అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టు సభ్యుల దగ్గరకు వెళ్లాడు. కాగా జట్టులోని అత్యంత పిన్నవయస్కుడి చేతికి ట్రోఫీనిచ్చే సంప్రదాయాన్ని టీమిండియా గత కొంతకాలంగా పాటిస్తోంది. అయితే, ఈసారి మాత్రం ప్రస్తుతం జట్టులో అందరికంటే పెద్దవాడైన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 37 ఏళ్ల దినేశ్‌ కార్తిక్‌ చేతికి ట్రోఫీని అందించారు. 

డీకేను టీజ్‌ చేసిన పాండ్యా!
కానీ.. డీకే మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇంతలో హార్దిక్‌ పాండ్యా బలవంతంగా అతడి చేతికి ట్రోఫీ అందించి.. పైకెత్తి చూపించాలంటూ టీజ్‌ చేశాడు. ఈ సరదా సన్నివేశాలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘డీకే చేతికే ట్రోఫీ ఎందుకు? ఎందుకంటే.. అందరికంటే తనే ‘చిన్నవాడు’ కదా! అందుకు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ముగించుకున్న టీమిండియా.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబరు 28(బుధవారం) నుంచి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రొటిస్‌ ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు.

చదవండి: IND vs SA: 'కోహ్లి, బాబర్‌ కాదు.. రాబోయే రోజుల్లో అతడే స్టార్‌ బ్యాటర్‌'
T20 WC 2022: దినేశ్‌ కార్తిక్‌ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top