IND vs SA: 'కోహ్లి, బాబర్‌ కాదు.. రాబోయే రోజుల్లో అతడే స్టార్‌ బ్యాటర్‌'

Suryakumar Yadav will leave everyone behind: Kaneria - Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌  ప్రస్తుతం భీకర ఫామ్‌లోఉన్నాడు. హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌పై పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు.

రాబోయే ఏళ్లలో విరాట్‌ కోహ్లి, బాబర్‌ ఆజాం వంటి స్టార్‌ ఆటగాళ్లను సూర్య అధిగమిస్తాడని కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని అతడు కొనియాడాడు. కాగా సూర్య ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్దానంలో ఉన్నాడు.

ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు
"ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటరల్లో సూర్యకుమార్‌ ఒకడు. నేను గత కొంత కాలంగా ఇదే చెబుతున్నాను. 360 డిగ్రీలలో అతడు ఆడే షాట్లు అద్భుతమైనవి. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో సూర్య మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్య రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద స్టార్‌ ఆటగాడు అవుతాడు.

అతడు బ్యాటింగ్‌ చేసే విధానం.. ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందరినీ మరచిపోయేలా చేస్తుంది. కోహ్లి, బాబర్‌ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. కానీ రాబోయే రోజుల్లో వీరిద్దరిని అధిగమించి ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తన పేరును లిఖించుకుంటాడు" అని కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్‌.. వైస్‌ కెప్టెన్‌గా శాంసన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top