‘బాగుందిరా మావ’.. నితీష్‌ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్‌! వీడియో | Shubman Gill Speaks Telugu To Praise Golden Arm Man Nitish Reddy, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND vs ENG: ‘బాగుందిరా మావ’.. నితీష్‌ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్‌! వీడియో

Jul 10 2025 9:05 PM | Updated on Jul 11 2025 12:23 PM

Shubman Gill speaks Telugu to praise golden arm man Nitish Reddy

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ త‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న అద్బుత బౌలింగ్‌తో భార‌త జ‌ట్టుకు ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు అందించాడు. త‌న తొలి ఓవ‌ర్‌లోనే ఇంగ్లండ్ ఓపెన‌ర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియ‌న్‌కు పంపాడు.

జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ఆకాష్ దీప్ వంటి పేస‌ర్లు వికెట్ తీసేందుకు శ్ర‌మించిన చోట‌.. నితీశ్ త‌న గోల్డెన్ ఆర్మ్‌తో ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాకిచ్చాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు కూడా ఈ ఆంధ్ర ఆల్‌రౌండ్ బౌలింగ్‌ను ఎదుర్కొవ‌డానికి ఇబ్బంది ప‌డ్డారు.  ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసి జో రూట్ వంటి బ్యాట‌ర్ల‌కు సైతం చుక్క‌లు చూపించాడు.

ఈ క్ర‌మంలో నితీశ్‌ను భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు.  'బౌలింగ్ బాగుందిరా మావ'అంటూ ప్ర‌శంసించాడు. అత‌డి మాట‌లు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

55 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(62), బెన్‌స్టోక్స్ ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నితీశ్ కుమార్ రెడ్డి రెండు,  జ‌స్ప్రీత్ బుమ్రా, జ‌డేజా త‌లా వికెట్ సాధించారు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement