Shumban Gill Century: సెంచరీతో మెరిసిన శుబ్‌మన్‌ గిల్‌..

Shubman Gill Back-To-Back Centuries In ODI Cricket Vs NZ 1st ODI Uppal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గిల్‌ 87 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు మినహా గిల్‌ బ్యాటింగ్‌లో ఎక్కడా లోపం కనిపించలేదు. కాగా గిల్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలోనూ గిల్‌ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా వన్డేల్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ.

వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న గిల్‌
ఈ క్రమంలోనే వన్డేల్లో గిల్‌ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 19 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా.. పాక్‌ ఆటగాడు ఇమాముల్‌ హక్‌తో కలిసి గిల్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌(18 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. 

ఇక టీమిండియా ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గిల్‌ 111, పాండ్యా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు సూర్యకుమార్‌ 31 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రోహిత్‌ 34 పరుగులు చేశాడు. కోహ్లి 4, ఇషాన్‌ కిషన్‌ 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.

చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్‌మన్‌ గిల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top