సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా..

Shubman Gill- Rohit Sharma- Ishan Kishan: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీలతో దుమ్మురేపడం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతూ సెలక్టర్లకు తలనొప్పి తెప్పిస్తున్నారు ఈ యువ డైనమైట్లు. అయితే, ఈ ‘స్నేహపూరిత వైరం’ ఆట వరకే! బయట వీళ్లు జాన్‌జిగిరీ దోస్తులట.. డ్రెస్సింగ్‌రూంలో వీళ్లు చేసే అల్లరి ముఖ్యంగా.. ఇషాన్ వేసే చిలిపి వేషాలు మామూలుగా ఉండవట!
ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ స్వయంగా వెల్లడించాడు. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో అద్భుతమైన ద్విశతకం బాది పంజాబీ బ్యాటర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సందడి చేశారీ ఇద్దరు మిత్రులు.
ముచ్చటగా ముగ్గురు డబుల్ సెంచరీల వీరులు ఒక్కచోట చేరి సంభాషణ సాగించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
ఇషాన్ కిషన్: నేను అతడిని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా! మ్యాచ్‌కు ముందు నీ రొటిన్ ఎలా ఉంటుంది గిల్?
రోహిత్ శర్మ: (మధ్యలో కలుగజేసుకుంటూ).. ఆ విషయం అయితే నీక్కూడా తెలియాలి. ఎందుకంటే మీ ఇద్దరు ఒకే రూమ్‌లో ఉంటారు కదా!
శుబ్‌మన్ గిల్: కిషన్ నా ప్రి- మ్యాచ్ రొటిన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఫుల్ సౌండ్ పెట్టి మూవీస్ చూస్తూ ఉంటాడు. నేను తనని తిట్టకుండా ఉండలేను. సౌండ్ తగ్గించమని చెప్తాను. కానీ తను మాత్రం మాట వింటే కదా! ఇది నా రూమ్.. నేను చెప్పిన రూల్సే ఇక్కడ పాటించాలి అంటాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇదే నా ప్రి- మ్యాచ్ రొటీన్.
ఒకే ఫ్రేమ్‌లో భారత ఓపెనింగ్ డబుల్ సెంచరీ వీరులు(PC: BCCI)
ఇషాన్ కిషన్: నేనిలా ఎందుకు చేస్తానంటే.. నువ్వు నా గదిలో పడుకుంటున్నావు. అంతేకాదు నేను చేయాల్సిన పరుగులు నీ ఖాతాలో వేసుకుంటున్నావు! బహుశా అందుకే ఇలా జరుగుతుందేమో!
రోహిత్ శర్మ: ఇదంతా ఊరికే సరదాకి! వీళ్లిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాన్నాళ్లుగా టీమిండియాకు ఆడుతున్నారు. వీళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇద్దరూ పరస్పరం సోదరభావంతో మెలుగుతారు.
ఇషాన్ రికార్డు బద్దలు
వీరి ముగ్గురి సరదా ముచ్చటకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇషాన్ కిషన్(24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉన్న రికార్డును గిల్ (23 ఏళ్ల 132 రోజులు) బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీనితో పాటు మరిన్ని అరుదైన ఘనతలు కివీస్‌తో మ్యాచ్ సందర్భంగా సాధించాడు.
ఆఖరి వరకు ఉత్కంఠ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో గెలుపొందింది. శుబ్‌మన్ డబుల్ సెంచరీతో మెరవగా.. లోకల్ బాయ్ సిరాజ్ నాలుగు వికెట్లతో రాణించాడు.
ఇక లక్ష్య ఛేదనలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్ టీమిండియాను కంగారు పెట్టాడు. అయితే, ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ గడ్డపై ద్విశతకం బాదిన ఇషాన్.. బుధవారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరాడు.
చదవండి: IND VS NZ 1st ODI: డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్
1⃣ Frame
3️⃣ ODI Double centurionsExpect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak
Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax
— BCCI (@BCCI) January 19, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు