
మేజర్ లీగ్ క్రికెట్-2025 టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం డల్లాస్ వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధిచింది.
టీఎస్‌కే బ్యాటర్లలో శుభమ్ రంజనే(75 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డోనోవన్ ఫెర్రీరా(43), సమిత్ పటేల్(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడరు. కెప్టెన్ డుప్లెసిస్(12), స్టార్ ఆల్‌రౌండర్(0) విఫలమయ్యారు.
నైట్‌రైడర్స్ బౌలర్లలో వాన్ షాల్క్వైక్, రస్సెల్ తలా మూడు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. లాస్ ఏంజిల్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
టీఎస్‌కే బౌలర్లలో అకిల్ హూస్సేన్, నూర్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, స్టోయినిష్, ఫెర్రీరా తలా వికెట్ సాధించారు. టీఎస్‌కే ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలుపొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో డుప్లెసిస్ టీమ్ రెండో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్