Sakshi News home page

Mohammed Shami: ఐపీఎల్‌ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! వైరల్‌

Published Thu, Mar 14 2024 8:02 PM

Shami Likes Post Talking About India Player Faked Injury In WC To Play In IPL - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 సమయంలోనే మడిమ నొప్పి వేధించినా పంటి బిగువన భరించి జట్టు కోసం తపించాడు టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ. మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల(24) వీరుడిగా నిలిచి సత్తా చాటాడు.

సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్‌ వరకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.  అయితే, ఈ టోర్నీ ముగిసిన తర్వాత షమీ మళ్లీ ఇంత వరకు మైదానంలో దిగలేదు. మడిమ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ రైటార్మ్‌ పేసర్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ అందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అందరికీ హెలో! నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను. నాకు సర్జరీ జరిగి 15 రోజులు అవుతోంది. 

ఇటీవలే సర్జరీ సమయంలో వేసిన కుట్లు విప్పారు. కోలుకునే ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని షమీ తన ఫొటోలు పంచుకున్నాడు. 

ఇందుకు బదులిస్తూ ఓ నెటిజన్‌.. ‘‘వరల్డ్‌కప్‌ సమయంలో నొప్పిని భరిస్తూనే షమీ భాయ్‌... వంద శాతం ఎఫర్ట్‌ పెట్టాడు. కానీ ఓ ఆటగాడు ఉన్నాడు.. గాయపడకపోయినా.. గాయపడినట్లు నమ్మించి.. ఐపీఎల్‌ కోసం మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు.

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించినట్లుగా ఉన్న ఈ పోస్టుకు షమీ లైక్‌ కొట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వరల్డ్‌కప్‌-2023 సమయంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన పాండ్యా.. తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు.

అయితే, ఐపీఎల్‌-2024కు మాత్రం అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ను వీడిన పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్‌ గూటికి చేరి కెప్టెన్‌గా ఎంపికైన విషయం విదితమే!.. మరోవైపు.. గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. ఈ సీజన్‌ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు.   ​

చదవండి: అతడు టీమిండియా కెప్టెన్‌.. వేటు వేస్తారా?: యువరాజ్‌ సింగ్‌

Advertisement

What’s your opinion

Advertisement