IND vs WI: వన్డేల్లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ అరుదైన ఫీట్‌.. నాలుగో ఆటగాడిగా..!

Shai Hope joins Dhawan, Warner, Gayle in elite list after impressive century Against India - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా భారత్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌  అరుదైన ఘనత సాధించాడు. తన వన్డే కెరీర్‌లో 100వ మ్యాచ్‌ ఆడిన హోప్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా 100వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 10 ఆటగాడిగా హోప్‌ నిలిచాడు. గతంలో గార్డన్‌ గ్రీనిడ్జ్‌ (వెస్టిండీస్‌), క్రిస్‌ కెయిన్స్‌ (న్యూజిలాండ్‌), మొహమ్మద్‌ యూసుఫ్‌ (పాక్‌), సంగక్కర (శ్రీలంక), క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌) ట్రెస్కోథిక్‌ (ఇంగ్లండ్‌), రాంనరేశ్‌ శర్వాణ్‌ (వెస్టిండీస్‌), డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), శిఖర్‌ ధావన్‌ (భారత్‌) ఈ ఘనత సాధించారు.

అదే విధంగా ఈ అరుదైన రికార్డు సాధించిన నాలుగో విండీస్‌ ఆటగాడిగా హోప్‌ రికార్డులకెక్కాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్‌: విండీస్‌- బ్యాటింగ్‌
వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
సెంచరీతో చెలరేగిన షై హోప్‌(115 పరుగులు)
భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54)

చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top