సంజూ శాంసన్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన పరాయి దేశం

Sanju Samson Gets Offer From Ireland Cricket Board - Sakshi

Sanju Samson: టాలెంట్‌ ఉన్నప్పటికీ అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్న టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ సంజూ శాంసన్‌కు పరాయి దేశం ఐర్లాండ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలని శాంసన్‌కు ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఆహ్వానం పలికినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ, భారత క్రికెట్‌తో తెగదెంపులు చేసుకుని తమ దేశానికి వస్తే, తమ జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిస్తామని ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను సంజూ తిరస్కరించాడని తెలుస్తోంది. తాను భారత్‌ తరఫున తప్ప మరే దేశం తరఫున క్రికెట్‌ ఆడేది లేదని ఖరాకండిగా తెలిపినట్లు సమాచారం.

అంతర్జాతీయ క్రికెట్‌ ఆడితే టీమిండియాకు మాత్రమే ఆడాలని కోరుకుంటానని, ఇతర దేశం తరఫున క్రికెట్‌ ఆడటాన్ని కలలో కూడా ఊహించలేనని తనను సంప్రదించిన ఐరిష్‌ ప్రతినిధులకు సంజూ తెలిపాడని వార్తలు వస్తున్నాయి. 

కాగా, అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్‌, హిట్టింగ్‌ అన్నింటికీ మించి మంచి ఫామ్‌లో ఉన్నా, సంజూకు సరైన  ఛాన్స్‌లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని అతని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయినా స్పందించని బీసీసీఐ.. సంజూ మినహా చాలామందికి అవకాశాలు ఇస్తూ పోతుంది. ఇలాంటి ఓ అవకాశం దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఏకంగా డబుల్‌ సెంచరీ బాది సంజూకు పోటీగా నిలిచాడు. 28 ఏళ్ల సంజూ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top