
Picture Credit: X/@mipaltan
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైనప్పటకి.. సంజూ మాత్రం తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కాగా ఇది సంజూకు రాజస్తాన్ కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా శాంసన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది.
2016లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ 48 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్‌తో 8 ఏళ్ల రోహిత్ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. శాంసన్, రోహిత్‌లతో పాటు గౌతమ్ గంభీర్ కూడా కెప్టెన్‌గా తన 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించాడు. అతను 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ కెప్టెన్‌గా 59 పరుగులు చేశాడు.
కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు చేసింది వీరే..
68* (38) - సంజు శాంసన్ (రాజస్తాన్) వర్సెస్ గుజరాత్, 2024
65 (48) - రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)వర్సెస్ ఢిల్లీ, 2016
59 (46) - గౌతమ్ గంభీర్ (కేకేఆర్) వర్సెస్ ఆర్సీబీ, 2013
45 (33) - డేవిడ్ వార్నర్ (ఎస్ఆర్‌హెచ్) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2021