Sania Mirza: ఒలింపిక్‌ పతకం లేకపోయినా బాధలేదు.. నేనో ట్రెండ్‌ సెట్టర్‌గా భావించడం లేదు!

Sania Mirza Retirement Her Inspiring Words I Am Not Trend Setter - Sakshi

Sania Mirza Retirement: ‘‘నా జీవితంలో టెన్నిస్‌ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్‌ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ వచ్చి గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు.

ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా దాంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్‌ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది. దానికి నేను గర్విస్తున్నా. సింగిల్స్‌లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్‌–30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే.

మణికట్టుకు శస్త్రచికిత్సల తర్వాత సింగిల్స్‌లో ఆడటం ఇబ్బందిగా మారడంతో డబుల్స్‌కు మారాను తప్ప ఆడలేక కాదు. ఎక్కడైనా నంబర్‌వన్‌ అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్‌ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా.

నేనో ట్రెండ్‌ సెట్టర్‌గా భావించడం లేదు. నాకు వచ్చిన, నచ్చిన రీతిలో ఆడుతూ పోయాను. ఆ క్రమంలోనే ఈ విజయాలన్నీ వచ్చాయి’’ అని భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. 

నంబర్‌ 1గా ఎదిగి.. ఓటమితో ముగింపు
ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. నంబర్‌ 1 స్థాయికి ఎదిగిన ఈ హైదరాబాదీ ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దుబాయ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి ద్వారా ప్లేయర్‌గా సానియా టెన్నిస్‌ కెరీర్‌ ముగిసిపోయింది. ఐదేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. 

మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచి మరే ఇతర భారత మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో రికార్డులు నెలకొల్పారు. 43 డబుల్స్‌ ట్రోఫీలు సాధించారు. 91 వారాలు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగారు.

చదవండి: Sania Mirza: 'వండర్‌ ఉమన్‌'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో..
Smriti Mandhana: వారెవ్వా.. ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ దాదానే తలపించింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top