ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్‌.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్‌! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

SA vs IND: ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్‌.. దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్‌! వీడియో వైరల్‌

Published Sat, Dec 16 2023 7:08 AM

 Rohit Sharma spotted at airport as he leaves for IND vs SA Tests - Sakshi

దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌  సౌతాఫ్రికాకు పయనమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హిట్‌మ్యాన్‌ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అతడు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా సెంచూరియన్‌కు చేరుకోనున్నాడు. ఇప్పటికే   టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లి కూడా దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రోహిత్‌ కూడా జట్టుతో కలవనున్నాడు. కాగా ఈ విరోహిత్‌ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్‌ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.

ముంబై కెప్టెన్సీ నుంచి అవుట్‌..
ఇక ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ప్రాంఛైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు సార్లు తమ జట్టును ఛాంపియన్స్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించింది.

అతడి స్ధానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను తమ జట్టు కొత్త సారథిగా ముంబై ఇండియన్స్‌ నియమించింది. కాగా వచ్చే ఏడాది సీజన్‌క సంబంధించిన వేలానికి ముందు హార్దిక్‌ను గుజరాత్‌ నుంచి ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ధోని జెర్సీ నంబర్‌ ‘7’కు రిటైర్మెంట్‌: బీసీసీఐ

Advertisement
 
Advertisement
 
Advertisement