RCB Vs MI: శెభాష్‌ డీకే భాయ్‌, నీవు వరల్డ్‌ కప్‌లో ఆడాలి.. రోహిత్‌ ఆఫర్‌! వీడియో వైరల్‌ | IPL 2024 RCB Vs MI: Rohit Sharma Sledges Dinesh Karthik With Witty WC Selection Remark, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI: శెభాష్‌ డీకే భాయ్‌, నీవు వరల్డ్‌ కప్‌లో ఆడాలి.. రోహిత్‌ ఆఫర్‌! వీడియో వైరల్‌

Apr 12 2024 1:20 AM | Updated on Apr 12 2024 12:10 PM

Rohit Sharma Sledges Dinesh Karthik With Witty WC Selection Remark - Sakshi

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ కేవలం 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేష్‌ కార్తీక్‌ మాత్రం తన బ్యాటింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు.

మరోసారి కార్తీక్‌ ఫినిషర్‌గా అవతారమెత్తాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ముంబై బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. రివర్స్‌ స్వీప్‌, స్కూప్‌ షాట్లతో కా​ర్తీక్‌ ఆలరించాడు. ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్‌ సాధించడంలో కార్తీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్‌.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అయితే కార్తీక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ సైతం ఫిదా అయిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ.. కార్తీక్‌ వద్దకు వెళ్లి చప్పట్లు కొడుతూ అభినంధించాడు. అంతేకాకుండా డీకే భాయ్‌ నీవు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలంటూ రోహిత్‌ నవ్వుతూ ఉన్నాడు. కార్తీక్‌ కూడా ఒకే అన్నట్లు నవ్వుతూ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement